ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడగిస్తారా?

60చూసినవారు
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడగిస్తారా?
ఐటీఆర్ దాఖలు చేయడానికి జులై 31తో గడువు ముగియనుంది. అయితే సాంకేతిక సమస్యలతో ఐటీఆర్ దాఖలులో పలువురు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ-ఫైలింగ్ సైట్లో లాగిన్ ఇబ్బందులు, పాస్‌వర్డ్ రీసెట్, ఈ-వెరిఫికేషన్‌లోనూ సమస్యలున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గడువు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈనెల 14 వరకు 2.7కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాదితో పోల్చితే ఇది 13% అధికం.

సంబంధిత పోస్ట్