మూడోసారి తండ్రైన విలియమ్‌సన్

575చూసినవారు
మూడోసారి తండ్రైన విలియమ్‌సన్
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్‌సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ‘ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయికి స్వాగతం. మీ సురక్షిత రాక, ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అంటూ కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. తన భార్య, కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. విషయం తెలిసిన ఫాన్స్, క్రికెటర్స్ విలియమ్‌సన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్