2019 నుంచి CSKతోనే..!

84చూసినవారు
2019 నుంచి CSKతోనే..!
CSK కెప్టెన్‌గా నియమితుడైన రుతురాజ్‌ గైక్వాడ్‌ 2019 సీజన్‌లో సీఎస్కే తరఫున ఐపీఎల్‌లోకి వచ్చాడు. ఆ సీజన్‌, ఆ తర్వాతి సీజన్‌లో కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. కానీ 2021 ఎడిషన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 635 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 2022 సీజన్‌లోనూ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు (368) చేసిన బ్యాటర్‌ రుతురాజే. గతేడాది (2023) సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో గైక్వాడ్‌ కీలక పాత్ర పోషించాడు.

సంబంధిత పోస్ట్