తిరుమలపై తప్పుడు ప్రచారం.. మూడు యూట్యూబ్ ఛానళ్లపై కేసు

55చూసినవారు
తిరుమలపై తప్పుడు ప్రచారం.. మూడు యూట్యూబ్ ఛానళ్లపై కేసు
AP: తిరుమల ఆలయంపై తప్పుడు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లపై ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవచనకర్త చాగంటి ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ఆయనకు సరైన దర్శనం కల్పించినప్పటికీ తప్పుడు ప్రచారం జరగడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లపై టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషణ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్