మౌనీ అమావాస్యను పురస్కరించుకొని తమిళనాడులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తిరునెల్వేలిలోని తమిరబరణి నదిలో భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నాలు చేశారు. పురాణాల ప్రకారం నేడు పుణ్యస్నానం ఆచరిస్తే స్వర్గానికి పోతారని నమ్మకం. ఈ క్రమంలో భక్తులు ఉదయాన్నే ప్రముఖ దేవాలయాలకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.