TG: హైదరాబాద్ మీర్పేట్లో వెంకటమాధవి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆమె భర్త గురుమూర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసు వివరాలను వెల్లడించిన సీపీ సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రెస్మీట్ పెట్టే ముందు మరోసారి అతడిని చూసేందుకు వెళ్లా. పర్సనాలిటీ బాగుంది. చాలా అందంగా కూడా ఉన్నాడు. నార్మల్గానే ఉన్నాడు కానీ బిహేవియర్ మాత్రం క్రూయల్' అని అన్నారు.