యూపీలోని అమ్రోహాలో షాకింగ్ ఘటన జరిగింది. హసన్‌పూర్ పట్టణంలో ఓ మహిళ వృద్ధ దుకాణదారుడిని చెప్పుతో చితకబాదింది. స్థానికులు చూస్తుండగానే దూషించుకుంటూ అతడిని చెప్పుతో కొట్టింది. అయితే ఆ వృద్ధ వ్యక్తి తనని వేధించాడని సదరు మహిళ ఆరోపించింది. కాగా ఈ ఘటనపై అమ్రోహ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వాస్తవం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.