కొడుకుతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన మహిళ (వీడియో)

55చూసినవారు
రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడలో తమకు న్యాయం చేయాలంటూ కొడుకుతో కలిసి ఓ మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి బీటుకూరి ఉదయ్ భాస్కర్‌కు పదేళ్ల కిందట ఆలేఖ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. అయితే బాలుడు మానసిక, శారీరక దివ్యాంగుడు కావడంతో ఉదయ్ కొడుకును వదిలేసి భార్యను తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆలేఖ్య కోర్టును ఆశ్రయించింది. ఏళ్లు గడుస్తున్నా న్యాయం దొరక్కపోవడంతో ధర్నాకు దిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్