మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారు (వీడియో)

64చూసినవారు
ఒడిశాలోని జాజ్‌పూర్‌లో డిసెంబర్ 25న దారుణ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. వారిద్దరూ మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారని, క్రిస్మస్ పండుగ జరుపుకున్నందుకు వారిని వేధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలిసులు స్పందించాల్సి ఉంది. దీనికి సంబంధించిన  వీడియో వైరల్ అవుతోంది. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యనిస్తున్నారు.

సంబంధిత పోస్ట్