వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన ఆర్.వైశాలి కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్‌పై 2.5-1.5 తేడాతో గెలిచింది. సెమీస్‌లో చైనాకు చెందిన జు వెంజన్ చేతిలో 0.5-2.5 తేడాతో ఓడిపోయింది. కాగా ర్యాపిడ్ ఈవెంట్‌లో కోనేరు హంపి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.