ఆలేరు: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పూజలో మంత్రి

50చూసినవారు
తెలంగాణ ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయ మర్యాదలతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్నారు. వారి వెంట ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్