గీతకార్మికులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

67చూసినవారు
గీతకార్మికులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం
గీతకార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం నియోజకవర్గంలోని 200 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం మోకులను స్థాని క ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత వృత్తికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందన్నారు. కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వా రి భద్రతకోసం ప్రత్యేకంగా కిట్లను అందిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్