ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు అనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలు అత్యుత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. కాగా యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం పలువురు ట్రాన్స్ జెండర్లు ఓటువేసి తమ బాధ్యత నిర్వర్తించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో ఓటు వేయటం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.