చెక్కు బౌన్స్ కేసులో మహిళకు జైలుశిక్ష
భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రావి సురేష్ రెడ్డి భువనగిరి టౌన్లో నివాసముంటున్న బొడ్డు శ్రీలక్ష్మికి రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. బదులుగా ఆమె వద్ద నుంచి చెక్ తీసుకున్నాడు. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో చెక్ బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయ్యింది. దీంతో కోర్టులో దావా వేయగా. బొడ్డు శ్రీలక్ష్మికి ఏడాది జైలుశిక్ష, రూ. 5000 జరిమానా విధిస్తూ భువన గిరి కోర్టు అడిషనల్ జడ్జి కవిత తీర్పు వెలువరించారు.