మోడల్ స్కూల్ లో ప్రవేశాలు

50చూసినవారు
వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ నందు 2024 - 25 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఏడు నుండి పదవ తరగతి వరకు ఖాళీలు భర్తీ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ప్రిన్సిపాల్ గోరంట్ల రాము తెలిపారు. 22 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూపాయలు 150 ఓసి విద్యార్థులు రూపాయలు200 ఫీజు చెల్లించాలన్నారు.