రూబిక్ క్యూబ్స్‌తో ష‌మీ చిత్రాన్ని వేసిన అభిమాని.. వీడియో

101256చూసినవారు
టీమ్ ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ తనదైన బౌలింగ్ శైలితో భార‌త జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతేడాది సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో షమీ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆ టోర్నీలో టాప్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. తాజాగా షమీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అభిమాని క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకొని రూబిక్ క్యూబ్స్‌తో ష‌మీ చిత్రాన్ని వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ష‌మీ ఆ కుర్రాడిని అభినందించాడు.

సంబంధిత పోస్ట్