బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంపై ప్రకటన చేసిన నాటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. జూన్‌లో రాజకుటుంబం వేడుకలో కన్పించిన కేట్.. ఇప్పుడు మరోసారి ప్యాలెస్ నుంచి బయటకు రానున్నారు. లండన్‌లో జులై 14న జరిగే వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకానున్నారు.