భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

73చూసినవారు
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లా భువనగిరి శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కింద పడి బలమైన గాయాలు అయ్యాయి. భువనగిరి నుండి చౌటుప్పల్ కి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుడు కిషోర్ వలిగొండ మండలం సంగెం ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా కలెక్టరెట్ కు పని నిమిత్తం వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్