ప్రజలకు పోలీసులు కీలక సూచనలు

6341చూసినవారు
ప్రజలకు పోలీసులు కీలక సూచనలు
వలిగొండ ఎస్సై మహేందర్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. గ్రామాలలో విలువైన ఆభరణాలు మెడలో ధరించి ఆరు బయట మేడ మీద నిద్రించకూడదన్నారు. వీలైనంతవరకు గ్రామంలోని యువత ఎలాంటి దొంగతనాలు జరగకుండా పహారా తిరుగుతూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా రాత్రి వేళ అనుమానస్పద వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్