వలిగొండ మండలం వెంకటాపురంలోని రచ్చబండ సమావేశ గద్దెను తన సొంత నిధులతో నిర్మించిన కర్నేకంటి యాదయ్యని గ్రామస్థులు గురువారం సన్మానించారు.ఈ సందర్భంగా కర్నెకంటి యాదయ్య మాట్లాడుతూ ఇదే విధంగా గ్రామస్తులు నాకు సహకరిస్తే రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కాలువల మరమ్మతుల నిమిత్తం తన సొంత నిధుల నుండీ సంవత్సరంకు లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని.. అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని అన్నారు.