Jan 24, 2025, 10:01 IST/
ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మందికి గాయాలు (వీడియో)
Jan 24, 2025, 10:01 IST
కర్ణాటకలోని బెళగావిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలీలతో వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైకును తప్పించబోయి వాహనం అదుపు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.