మహా కుంభమేళా.. మౌని అమావాస్యకు 10 కోట్ల మంది భక్తులు!

81చూసినవారు
మహా కుంభమేళా.. మౌని అమావాస్యకు 10 కోట్ల మంది భక్తులు!
సనాతన హైందవ వేడుక మహా కుంభమేళాకు మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయాగ్‌ రాజ్‌లో వైభవోపేతంగా జరుగుతున్న మహా కుంభమేళాలో యోగులు, అఘోరాలు, సిద్ధులు, భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. మౌని అమావాస్య రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్‌, జనసందోహాలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక సిబ్బందిని వినియోగించనుంది.

సంబంధిత పోస్ట్