AP: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల భద్రత, శ్రేయస్సే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. రేపటి మూల స్తంభాలుగా నేటి ఆడబిడ్డలు ప్రకాశించేలా చేస్తామన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 ద్వారా రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టిస్తామన్నారు.