TG: హైదరాబాద్ మీర్‌పేట పీఎస్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీ చేశారు. ఇంట్లో రక్తపు ఆనవాళ్లను గుర్తించారు. వెంట్రుకలను స్వాధీనం చేసుకుని ఆధారాలను ఫొరెన్సిక్ విభాగానికి అప్పగించారు. మరోవైపు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. నేటి సాయంత్రానికి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే ఛాన్స్ ఉంది.