AP: కడప రవాణాశాఖలో మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భర్త లేని సమయంలో మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి లైంగిక దాడి చేశాడు. దాంతో మహిళ తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో బాధితురాలి భర్త రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి దేహశుద్ధి చేశాడు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి స్పందించారు. తక్షణమే ఆ అధికారిని విధుల నుంచి తొలగించి కేంద్ర కార్యాలయానికి సరెండర్ చేయాలని ఆదేశించారు.