మా గోస పట్టించుకోండి సారు!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలంలోని పుట్టగూడెం తండాలో మూడు రోజుల నుండి నల్ల నీళ్ళు రావడం లేదు. దీంతో మహిళలు వ్యవసాయ బావుల వద్ద నుండి బిందెలతో నీళ్ళు తీసుకుని వస్తున్నారు. నీటి సమస్యపై సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా మా గోడు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంభందిత అధికారులు స్పందించి గ్రామంలోకి నీళ్ళు వచ్చేల చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.