Feb 10, 2025, 13:02 IST/
అందుకే ఆన్లైన్ రైలు టిక్కెట్ రేటు ఎక్కువ: మంత్రి
Feb 10, 2025, 13:02 IST
కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే ఆన్లైన్ టిక్కెట్స్ ఎక్కువ రేటు ఉండడంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. 'ఆన్లైన్ టిక్కెట్లను అందించే IRCTC.. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్, వెబ్సైట్ నిర్వహణ ఖర్చులన్నింటిని భర్తీ చేయడానికి ఛార్జ్ వసూలు చేస్తుంది. దీంతోపాటు రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి GST కూడా వసూలు చేస్తుంది. దీంతో ఆన్లైన్ టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి' అని మంత్రి స్పష్టం చేశారు.