రోడ్డు ప్రమాదంలో కౌన్సిలర్ కుమారుడు మృతి

547చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కౌన్సిలర్ కుమారుడు మృతి
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన4వ వార్డు కౌన్సిలర్ ఎర్రవెల్లి మల్లమ్మ యాదయ్య ల కుమారుడు ఎర్రవెల్లి పరశురాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాదులో నివాసం ఉంటున్న పరశురాం, శుక్రవారం స్వగ్రామం కొండగడప వచ్చి రాత్రి తిరిగి బైక్ పై స్నేహితుడు ఎర్రవెల్లి నరేష్ తో కలిసి హైదరాబాద్ కు వెళుతుండగా రాజన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదంలో నరేష్ గాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్