Sep 11, 2024, 11:09 IST/
జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Sep 11, 2024, 11:09 IST
జమ్మూకాశ్మీర్లోని కథువాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే మరో ఉగ్రవాది కోసం ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.