AP: జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. విజయవాడలోని ఒక హోటల్‌లో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి నాదెండ్ల మనోహర్ సైతం హాజరైనట్లు సమాచారం. నియోజకవర్గాల్లో తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఎమ్మెల్యేలు వివరించారట. అధికారులు తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి జనసేన మంత్రుల దగ్గరికి వెళ్లాల్సి వస్తోందని నాదెండ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.