AP: నెల్లూరులో కాల్పుల వ్యవహారం కలకలం సృష్టించింది. నగరంలోని ఆచారి వీధిలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తుపాకీ కాల్పులకు దారి తీసింది. రాజస్థాన్‌కు చెందిన రాజమౌళి జైన్ నెల్లూరుకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఆస్తి తగాదాలతో తల్లిదండ్రులను కొడుకు హితేష్ తుపాకీతో కాల్చేందుకు యత్నించాడు. ఐదుగురు వ్యక్తులతో కలిసి తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.