యాదగిరిగుట్టకు రూ.18 కోట్ల ఆదాయం

59చూసినవారు
యాదగిరిగుట్టకు రూ.18 కోట్ల ఆదాయం
TG: కార్తీక మాసంలో యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. వ్రతాలు, దర్శనాలు, భక్తుల ద్వారా విరాళాలు, కొండపైకి వాహన ప్రవేశం, తదితర రూపాల్లో నవంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నెల రోజులకు రూ.18.03 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు శనివారం తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52 లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్