తెలంగాణలోని హైదరాబాద్ ధూల్‌పేటలో గంజాయి స్మగ్లర్ల స్కెచ్ బయటపడింది. ఈ ప్రాంతం గంజాయి విక్రయాలకు అడ్డాగా మారడంతో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నేహా భాయ్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వద్ద పసుపు ప్యాకెట్లు మాత్రమే లభ్యమయ్యాయి. వాటిని విప్పి చూడగా లోపల గంజాయి ఉండడంతో పోలీసులు నివ్వెరబోయారు. ఆమెతో పాటు గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.