అవునా.. మంచినీళ్లు అతిగా తాగినా ప్రమాదమా..!

53చూసినవారు
అవునా.. మంచినీళ్లు అతిగా తాగినా ప్రమాదమా..!
శరీరం డీ హైడ్రేషన్‌ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే.. ఓవర్ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అంటే శరీరంలో నీరు ఎక్కువై ఎలక్ట్రోలైట్ల స్థాయిల్లో మార్పులు వస్తాయి. దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపించినట్టు ఉండటం, వాంతులు, కండరాల బలహీనత, పట్టేసినట్టు ఉండటం, తలనొప్పి వంటివి తలెత్తుత్తాయి.

సంబంధిత పోస్ట్