కొండ అంచుపై రీల్స్ తీస్తూ లోయలో పడిన యువతి (వీడియో)

57చూసినవారు
ఇన్‌స్టా రీల్స్ తీసే క్రమలో ప్రమాదవశాత్తూ పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా కొందరి తీరు మారడం లేదు. ఇదే కోవలో హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి కొండ అంచుల్లో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్ తీసింది. ఈ క్రమంలో కాలు జారి లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకే తాను ఇలా చేసినట్లు ఆమె పేర్కొంది.

సంబంధిత పోస్ట్