కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక ఎవరైనా కోస్తే వారికి రూ.11 లక్షలు ఇస్తానని సోమవారం ప్రకటించారు. రిజర్వేషన్లు అంతం చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన అన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని పేర్కొన్నారు. ఇక సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు.