నేరస్థుల చేతుల్లో మీ సిమ్‌కార్డులు!

76చూసినవారు
నేరస్థుల చేతుల్లో మీ సిమ్‌కార్డులు!
సూర్యాపేటకు చెందిన రైతు 4 నెలల కిందట ప్రీపెయిడ్‌ సిమ్‌కార్డు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఫోన్‌నంబర్‌ ద్వారా సైబర్‌ నేరాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నగరానికి చెందిన ఒక డీలర్‌ డబ్బుపై ఆశతో చేసిన తప్పిదమే దీనంతటికీ కారణమని తేలింది. ఒక్క సూర్యాపేట రైతు మాత్రమే కాదు.. ఎంతో మంది ఇలా తమకు తెలియకుండానే నేరస్థుల జాబితాలో చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్