ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు నడిరోడ్డులో ఓ యువకుడిని రౌడీలు కిందపడేసి దారుణంగా కొట్టారు. యువకుడిని కొడుతూ రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఓ మహిళ యువకుడిని కొట్టవద్దని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. ఓ చిన్న వివాదం కారణంగా యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.