యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్ 113 పీఎస్ పరధిలో ఆదివారం ఓ యువకుడు హై టెన్షన్ స్తంభం ఎక్కడంతో.. అక్కడ వైర్లు తగిలి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతొ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో చాలా శ్రమించి సురక్షితంగా కిందకు దించారు. అయితే సదరు యువకుడు హైటెన్షన్ స్తంభం ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో కారణం తెలియాల్సి ఉంది.