AP: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలో దారుణ ఘటన జరిగింది. కంపమల్లలో వైసీపీ నేతపై హత్యాయత్నం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అనుచరుడు, వైసీపీ నేత లోకేశ్ రెడ్డిపై దుండగులు వేటకొడవళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడొచ్చిన అతడి తండ్రి, తమ్ముడిపై కూడా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.