తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖల అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల లేఖల్ని అనుమతిస్తామని టీటీడీ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సిఫార్సు లేఖలపై ఇంక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.