తీవ్ర రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌లో శాంతిని నెలకొల్పేందుకు తాత్కాలిక ప్రభుత్వం రేపు కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ రేపు ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 15 మందితో బంగ్లా కొత్త క్యాబినెట్ ఏర్పడనుంది. ఇక రిజర్వేషన్లపై రగడ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే.