

మద్యం మత్తులో కత్తులతో ముగ్గురు వ్యక్తుల వీరంగం (VIDEO)
మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ దగ్గర మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి హల్చల్ చేశారు. కత్తులతో బెదిరించి దారి దోపిడీకి ప్రయత్నించారు. దీంతో స్థానికులు వారిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. నిందితులు బాలానగర్ కాలనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.