'ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా మెంటార్ శిఖర్ ధావన్‌కు అంకితమిస్తున్నా' అని అశుతోష్ చెప్పాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంలో సంబరాలకు ముందు అశుతోష్.. ధావన్‌తో వీడియోకాల్‌లో మాట్లాడాడు. 'చాలా ఆనందంగా ఉంది. లవ్యూ పాజీ' అని గబ్బర్‌పై ప్రేమను వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 'అశు-గబ్బర్.. ఇది ఢిల్లీ లవ్ స్టోరీ' అని రాసుకొచ్చింది.