IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లదే హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో ఫ్రాంచైజీలు మారిన ప్లేయర్లే కీలకంగా నిలిచారు. వీరిలో అశుతోష్ శర్మ(DC), కృనాల్ పాండ్యా(RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్(CSK) ఉన్నారు. గత సీజన్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన వీరు స్టార్ ప్లేయర్ల కంటే బాగా రాణిస్తున్నారు.