
అమెరికాలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాద్ నగర్‌కు చెందిన సునీత (56), ప్రగతి రెడ్డి(35), హర్వీన్ (6) మృతి చెందారు. వీరి స్వస్థలం కొందుర్గు మండలం టేకులపల్లి కావడంతో గ్రామంలో విషాదఛాయులు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.