కొడుకు మ్యూజిక్కు సుధీర్ బాబు పాట.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'హరోం హర' మే 31న థియేటర్లలో సందడి చేయనుంది. జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుండి 'మురుగుడి మాయ' అనే కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా తన కొడుకు కోక్ బాటిల్‌పై కత్తెరతో మ్యూజిక్ వాయిస్తుంటే.. సుధీర్ బాబు మురుగుడి మాయ పాట పాడాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.