SIను నగ్నంగా స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)
యూపీలోని ఆగ్రా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిహయ్య గ్రామంలోని ఇంట్లోకి పై కప్పు నుంచి ఓ వ్యక్తి దూకాడు. లోపలికి వెళ్లి బాలికను వేధించాడు. బాలిక కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చి చూడగా మద్యం మత్తులో ఓ వ్యక్తి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు. అతడిని ఎస్ఐ సందీప్ కుమార్‌గా గుర్తించారు. అతడిని వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి కొట్టారు.