పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కొన్ని చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస థియేటర్ అద్దాలను అభిమానులు ధ్వంసం చేశారు. సినిమా ప్రదర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమాను ఎందుకు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. మరోవైపు ఏపీలోని ఆళ్లగడ్డలో కొందరు ఆకతాయిలు స్క్రీన్ చించివేశారు.