AP: టీడీపీని కాపాడే శక్తి నారా లోకేశ్‌కు ఉందని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. "లోకేశ్‌కు టీడీపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ కార్యక్రమం జరగాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్. లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30 ఏళ్లు టీడీపీకి తిరుగు ఉండదు. అచ్చెన్నాయుడిని కేబినెట్లోకి తీసుకోవాలి." అని బుద్దా వెంకన్న కోరారు.